ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే మా లక్ష్యం: మంత్రి దుర్గేష్‌

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్‌ స్పష్టం చేశారు. విశాఖలో ఎంఎస్‌ఎంఈ బిజినెస్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన ఆయన, 2030 నాటికి ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యమన్నారు. ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో మైక్రో పార్కులు ఏర్పాటు చేసి 1.75 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.