భారత్‌లో హెచ్‌ఎండీ ప్రో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

భారతీయ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి హెచ్‌ఎండీ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంస్థ ఒక టీజర్‌ను విడుదల చేసింది. హెచ్‌ఎండీ ప్రో పేరుతో రానున్న ఈ కొత్త ఫోన్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. సిల్వర్ ఫినిష్‌తో కూడిన వెనుక డిజైన్, డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా విక్రయానికి అందుబాటులోకి రానుంది.