నిరాధార ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్న చైర్ పర్సన్ దావస్వాతి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్ రజిత తనపై, తన భర్తపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి తీవ్రంగా ఖండించారు. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని గడువు ఇచ్చినా ఇప్పటివరకు నిరూపించలేదని తెలిపారు. ఆర్పీ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.