చెరువుల పరిరక్షణ మన బాధ్యత.. మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ పిలుపు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అమనగల్

అమనగల్ సూరసముద్రం చెరువును మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి తదితరులు సందర్శించి చెత్తాచెదారాన్ని పరిశీలించారు. సిబ్బందితో కలిసి చెరువును శుభ్రం చేయించారు.

చెరువులో వ్యర్థాలు పడేయకుండా మున్సిపల్ ఆటోల్లోనే తడి, పొడి చెత్తను వేయాలని చైర్మన్ కోరారు. ప్రజలందరూ సహకరించి మన ఊరిని, చెరువును కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.