గుంటూరు జిల్లాలో వరద బీభత్సం: నీట మునిగిన వేలాది ఎకరాల పంటలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గుంటూరు
మురసు తుపాను ధాటికి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, తాడికొండ మండలాలు అతలాకుతలమయ్యాయని, నల్లమడ వాగు ఉగ్రరూపం దాల్చడంతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయని అధికారులు తెలిపారు. ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు సర్వస్వం కోల్పోయి కన్నీటిపర్యంతమవుతున్నారు. పలుచోట్ల రోడ్లు కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్ సాయికాంత్ వర్మ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.