తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు ఈశ్వర్ ఠాకూర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: థానే
ప్రముఖ టెలివిజన్ నటుడు ఈశ్వర్ ఠాకూర్ తీవ్ర కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు డయాబెటిస్ సమస్యలతో మహారాష్ట్రలోని థానేలో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గతంలో ఎఫ్.ఐ.ఆర్, భాబీజీ ఘర్ పర్ హై వంటి ప్రసిద్ధ ధారావాహికలలో నటించిన ఆయన, ప్రస్తుతం వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ప్రజల సహాయం కోరుతూ విజ్ఞప్తి చేశారు.