కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ పునరుద్ధరణకు ఆర్మీ ఇంజినీర్ల సేవలు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

కాళేశ్వరం బ్యారేజీలు మరియు ఎస్ఎల్బీసీ సొరంగ పనుల పునరుద్ధరణకు ఆర్మీ ఇంజినీరింగ్ అధికారుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో సైన్యాధిపతిని కలసి విజ్ఞప్తి చేయగా, ముగ్గురు ఆర్మీ అధికారుల పేర్లను కేంద్రం పంపిందని ఆయన వెల్లడించారు. పనుల్లో వేగం, నాణ్యత, భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.