నెల్లూరులో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహణ

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు గణేష్ ఘాట్‌లో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 18న నిమజ్జనం రోజున ప్రత్యేక గంగాహారతి నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా గణేశ్‌ ఘాట్‌ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.