బాపట్ల జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Bapatla, Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా నేర ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ నిరంతర నిఘా ద్వారా నేరాలను ముందే గుర్తించి, ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు బాపట్ల పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.