మహిళా సాధికారతే ధ్యేయం: విజయవాడలో నేషనల్ సరస్ మేళా ప్రారంభం

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయవాడ

విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారని అధికారులు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ వెలుపల ఈ మేళాను నిర్వహించడం రాష్ట్ర నారీ శక్తికి దక్కిన గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం స్వయం ఏపీ బ్రాండ్ను తీసుకువచ్చిందని వెల్లడించారు.