ఓటర్ల సంఖ్య భారీ తగ్గింపుపై సమాధానం ఇవ్వాలంటూ కేపీ వివేకానంద నిలదీత

రిపోర్టర్: రాము స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

తెలంగాణలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కె.పి. వివేకానంద - ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థపైనే ప్రజల్లో అనుమానాలు వస్తే అంతకంటే పెద్ద వైఫల్యం ఉండదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల నుంచి రెండు కోట్ల నలభై మూడు లక్షలకు ఓటర్ల సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు. ఈ ఇరవై ఏడు శాతానికి పైగా వ్యత్యాసానికి కారణమేంటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.