జూలూరుపాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జూలూరుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం-మాచినేనిపేట తండా మధ్యలో ఈరోజు ఉదయం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.