బతుకమ్మ వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి: అధికారులను కోరిన కొండు బానేష్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బతుకమ్మ పండుగ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సీపీఐ మండల కార్యదర్శి కొండు బానేష్ అధికారులను కోరారు. వీధిలైట్ల మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.