తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
రిపోర్టర్: సతీష్
స్థలం: తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిందని, టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే డెబ్బై ఏడు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.