వైకల్యాన్ని జయించిన గణేష్: అంతర్జాతీయ జలాల్లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టి
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
పుట్టుకతో కాలికి వైకల్యం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు గణేశ్ పారా స్విమ్మింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడని కోచ్ తులసీ చైతన్య తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గణేశ్ జర్మనీలోని బోడెన్సీ లేక్‌లో పన్నెండు కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల పద్నాలుగు నిమిషాల్లో ఈది సరికొత్త రికార్డు సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన తొలి పారా స్విమ్మర్‌గా గణేశ్ నిలిచారని కోచ్ వెల్లడించారు.