ఏషియన్ గేమ్స్ హాకీలో భారత జట్ల ఘన విజయాలు

రిపోర్టర్: గోపి స్థలం: భారత్

ఏషియన్ గేమ్స్ 2026లో భారత హాకీ జట్లు అదిరిపోయే ఆరంభం అందించాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు ఉజ్బెకిస్థాన్‌పై 19-0తో ఘన విజయం సాధించగా, పురుషుల జట్టు ఇండోనేషియాను 13-1తో చిత్తు చేసింది. మహిళల మ్యాచ్‌లో దీపిక ఏకంగా 8 గోల్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, పురుషుల మ్యాచ్‌లో దిల్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్ చేసి సత్తా చాటాడు.