నేటి రాత్రితో ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనాలు పూర్తి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు బుధవారం రాత్రితో ముగియనున్నాయి. ఈ నెల 25న శుక్రవారం జరగనున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లు, భద్రతా చర్యల నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి మండపం వద్ద బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన బడా గణేశుడిని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నిమజ్జనం చేయనున్నారు.