విద్యార్థులకు అలర్ట్: బిట్స్ లా స్కూల్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
బిట్స్ పిలానీ ఆధ్వర్యంలోని బిట్స్ లా స్కూల్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించినట్లు డీన్ విశ్వాస్ హెచ్ దేవియై వెల్లడించారు. ఇంటర్మీడియట్ లో నూటభాగం నలభై ఐదు శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్లాట్, ఏఐఎన్ టీ, స్లాట్ వంటి జాతీయ ప్రవేశ పరీక్షల స్కోర్లతో పాటు లా ఫౌండేషన్ అసెస్మెంట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.