సూర్యాపేట జిల్లాలో దారుణం: నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Suryapet, Telangana
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో కౌలుకు తీసుకొని సాగు చేసిన నాలుగెకరాల పంట నీళ్లు, కరెంట్ అందక ఎండిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై రైతు యాతాకుల మల్లయ్య పంటకు నిప్పు పెట్టి తగలబెట్టినట్లు Telugu Scribe వెల్లడించారు. చేతికి వచ్చే దశలో పంట కళ్లముందే ఎండిపోవడంతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని, అప్పులపాలై కన్నీటిపర్యంతమయ్యామని ఆ రైతు వాపోయినట్లు పేర్కొంటూ ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.