శ్రీశైలంలో భక్తుల కానుకల ప్రవాహం: ముప్పై రెండు రోజుల్లో నాలుగు కోట్ల ఆదాయం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీశైలం
అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ముప్పై రెండు రోజుల హుండీ కానుకల ద్వారా నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై రూపాయల నగదు రాబడి లభించినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపులో డెబ్బై ఐదు గ్రాముల బంగారం, రెండు కేజీల తొమ్మిది వందల గ్రాముల వెండితో పాటు పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు కూడా భారీగా లభించాయని తెలిపారు.