పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు: సీఈవో కీలక ప్రకటన
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువును నామినేషన్ల చివరి తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. సర్వర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అర్హులైన పట్టభద్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఫామ్-18 దరఖాస్తు సేవలను త్వరలోనే పునరుద్ధరిస్తామని స్పష్టం చేస్తూ, అర్హులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.