గొయ్యిలోకి దూసుకెళ్లిన బస్సు పెను ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పోలాకి

పోలాకి మండలం మెట్టపేట సమీపంలో గురువారం సాయంత్రం ప్రయాణికుల బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న గొయ్యిలోకి దూసుకెళ్లింది. చెరువు గట్టు వైపు బస్సు ప్రమాదకరంగా వంగిపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అదుపు తప్పడానికి గల కారణాలపై అధికారులు ప్రాథమిక విచారణను వేగవంతం చేశారు.