ఆమనగల్ మండలంలో నేడు ఐదు ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ మండల పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం ఐదు ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ శాఖకు ఒకటి, రవాణా శాఖకు ఒకటి, మున్సిపాలిటీకి సంబంధించి రెండు అలాగే విద్యుత్ శాఖకు ఒక వినతి పత్రం వచ్చినట్లు ఎంపీడీవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.