మూతపడిన పరిశ్రమలను తెరిపించి అన్నదాతలను ఆదుకోవాలి

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, మునకాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో మూతపడిన చెరుకు, జనపనార పరిశ్రమలను ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు లేక రైతులు పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక మధ్యవర్తుల చేతిలో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమలను తెరిపించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.