పట్టపగలు వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా బోగోలులో పట్టపగలు దారుణం జరిగింది. బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు గునపాటి వరమ్మను బైక్ పై వెంబడించిన ఓ యువకుడు లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించాడు. ఆమె నిరాకరించడంతో ఒక్కసారిగా దాడి చేసి మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.