షూటింగ్ సెట్ లో తీవ్ర అవమానం: అనిల్ కపూర్ షోపై గీతా టాండన్ ఫైర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబై

అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో సెట్ లో తమను తొమ్మిది గంటల పాటు వేచి ఉండేలా చేసి తీవ్రంగా అవమానించారని ప్రముఖ స్టంట్ కోఆర్డినేటర్ గీతా టాండన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడితో కలిసి అతిథులుగా వెళ్లిన తమకు కనీస గౌరవం దక్కలేదని, ప్రొడక్షన్ బృందం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పారితోషికం ఆశించకుండా కేవలం పిలిచారనే వెళ్లామని, అయితే అక్కడి పరిస్థితులు తీవ్ర నిరాశకు గురిచేశాయని ఆమె వెల్లడించారు.