'సీతాకోక చిలుక దశలోకి మారాలి': మేఘాంశ్‌ శ్రీహరి 'ఆస్మాన్‌' టీజర్ విడుదల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ శ్రీహరి కథానాయకుడిగా రామ్‌నందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆస్మాన్‌'. హీరో మేఘాంశ్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. కొండారు వెంకటేష్‌, మన్నెం శ్రీకాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలను స్పృశిస్తూ సందేశాత్మక కథాంశంతో పాటు ఆకట్టుకునే విజువల్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నట్లు టీజర్ ద్వారా స్పష్టమైంది.