హైదరాబాద్లో తీవ్ర తాగునీటి కొరత: రోజువారీ నీటి సరఫరాలో భారీ లోటు

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరంలో తాగునీటి కొరత తీవ్ర రూపం దాలుస్తోందని జలమండలి అధికారులు తెలిపారు. నగర ప్రజల అవసరాల కోసం ప్రతిరోజూ సుమారు 735 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా, కేవలం 585 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా అవుతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ప్రతిరోజూ సుమారు 150 మిలియన్ గ్యాలన్ల నీటి లోటు ఏర్పడుతోందని, వేసవిలో ట్యాంకర్ల డిమాండ్ విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.