యాదాద్రి జిల్లాలో సంచలనం: శివసత్తు సుధాకర్ స్వామి హత్య కేసులో విస్తుపోయే నిజాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో సంచలనం సృష్టించిన శివసత్తు సుధాకర్ స్వామి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. మృతుడు తనను తరచూ లైంగికంగా వేధిస్తూ, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడంతోనే హత్యకు పథకం రచించినట్లు ప్రధాన నిందితుడు పవన్ కుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడని, నగలు, నగదు దోపిడీతో పాటు వ్యక్తిగత వేధింపులే ఈ దారుణానికి ప్రధాన కారణమని అధికారులు స్పష్టం చేశారు.