పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం వెట్టువమ్ ఫస్ట్ లుక్ విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చెన్నై
సామాజికాంశాలను తెరపై ఆవిష్కరించడంలో పేరున్న తమిళ దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం వెట్టువమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను బుధవారం విడుదల చేశారు. శతాబ్దాల నాటి భారతీయ సంప్రదాయ క్రీడ మల్లఖంబం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కలై అరసన్, మైమ్ గోపి, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, ఈ క్రీడా నేపథ్యం ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.