పదో తరగతి ఫలితాల మెరుగుకు అనంతపురం విద్యాశాఖ డిజిటల్ ట్రాకింగ్ యాప్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Anantapur

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో అనంతపురం జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రత్యేక డిజిటల్ ట్రాకింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత విద్యా సంవత్సరంలో జిల్లా అట్టడుగు స్థానంలో నిలవడంతో ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచే మిషన్ మార్చ్ కార్యక్రమం కింద ప్రత్యేక శిక్షణ తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో జియోట్యాగింగ్ ఆధారిత లైవ్ ఫొటోలను అప్లోడ్ చేసేలా ఈ యాప్ను రూపొందించామన్నారు.