శ్రీవారి వైద్యసేవలో ప్రవాస వైద్యులు పాల్గొనాలి: తితిదే బోర్డు సభ్యుడు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి వైద్యసేవలో ప్రవాస వైద్యులు భాగస్వామ్యం కావాలని తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు పిలుపునిచ్చారు. అట్లాంటాలో జరిగిన వైద్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ప్రారంభించిన ఈ సేవలకు విశేష స్పందన వస్తోందని, తితిదే ఆసుపత్రుల్లో నిస్వార్థంగా సేవలు అందించేందుకు ప్రవాస వైద్యులు ముందుకు రావాలని కోరారు.