రాజాపేటలో యునాని దవఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సమీపంలో ప్రభుత్వ యునాని దవఖాన డాక్టర్ చందన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ కొయ మధు, ఉపసర్పంచ్ నెమలే కేదారి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలపై తగిన సలహాలు అందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.