ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మీ ప్రమాణం యాప్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ డి. రామారావు ఆదేశించారు. పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, కార్యాలయ సిబ్బంది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరు వేయాలి. హాజరు నమోదు చేయని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.