ఘనంగా దృశ్యం 3 ముగింపు పలకనున్న అజయ్ దేవగన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3'తో ఈ ఫ్రాంచైజీకి ఘనమైన ముగింపు పలకనున్నట్లు నటుడు అజయ్ దేవగన్ స్పష్టం చేశారు. కథను సాగదీయకుండా సరిగ్గా ముగించాలనే ఉద్దేశంతో ఈ మూడో భాగాన్ని తెస్తున్నామని తెలిపారు. మలయాళ వెర్షన్‌కు భిన్నంగా ఈ స్క్రిప్ట్ ఉంటుందని, మోహన్‌లాల్ ఈ సినిమాను చూడాలని ఎదురుచూస్తున్నట్లు అజయ్ దేవగన్ వెల్లడించారు.