సదర్ ఉత్సవాలు ఇక రాష్ట్ర పండుగ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

సదర్ సమ్మేళనం కేవలం ఒక్క వర్గానికి పరిమితమైన పండుగ కాదని, అది యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన సదర్ వేడుకల్ లో పాల్గొన్న ఆయన, యాదవ సోదరుల చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తూ ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం తరఫున ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.