ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తిరుపతిలో ప్రజా దర్బార్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ పనబాక లక్ష్మి పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కూడా పాల్గొన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె తక్షణ ఆదేశాలు జారీ చేశారు.