అన్నదాతల ఆక్రోశం: అకాల వర్షానికి తడిసి కొట్టుకుపోయిన వరి ధాన్యం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో సోమవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్ లో ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.