ఉద్యోగులకు చేతన్ భగత్ సలహా: రోజుకు నాలుగు గంటల పని చాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: బెంగళూరు

రోజువారీ కార్యాలయ పనివేళలపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులో జరిగిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు ఆఫీసులో గడిపే సమయం ముఖ్యం కాదని, కేవలం నాలుగు గంటలు పూర్తి ఏకాగ్రతతో చేసే నిజమైన పనే సరిపోతుందని స్పష్టం చేశారు. సమావేశాలు, విరామాలు, సాంకేతిక సమస్యలను మినహాయించి కేవలం పనిపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.