కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ కేటీఆర్ ఆగ్రహం

రిపోర్టర్: రమేష్ స్థలం: శంషాబాద్

బీఆర్ఎస్ పార్టీకి అధికారం మాత్రమే పోయిందని, ప్రజల గుండెల్లో పార్టీపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శంషాబాద్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో హైదరాబాద్లో ఒక్క ఇటుక కూడా వేయలేదని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు. త్వరలోనే రాష్ట్రంలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.