సినిమా అప్డేట్లపై అభిమానులు ఓపిక పట్టాలంటూ అల్లు అర్జున్ ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రాకాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల అప్డేట్లు లేకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అల్లు అర్జున్ స్పందించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యుత్తమ చిత్రాన్ని అందించేందుకు చిత్ర బృందం శ్రమిస్తోందని, అభిమానులు కాస్త ఓపిక పట్టాలని కోరారు. తమ నిరీక్షణకు తగిన ఫలితం తప్పక ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.