కొడంగల్ కడా వెయ్యి రోజుల మైలురాయి పూర్తి చేసుకుందన్న అధికారులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కొడంగల్
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా సాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి వివిధ రంగాల్లో భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నట్లు అధికారులు తెలిపారు. 2023 డిసెంబర్ 29న ఏర్పాటైన కడా పరిధిలో పందొమ్మిది శాఖల ద్వారా రూ.12,226.77 కోట్ల అంచనా వ్యయంతో సుమారు పైచిలుకు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ.4,725 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.