ఏపీజీబీసీ పనుల అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా శాఖాపరమైన విచారణ
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా అప్పట్లో ఏపీజీబీసీ ఎండీగా వ్యవహరించిన బి.రాజశేఖరరెడ్డితోపాటు మున్సిపల్ శాఖలోని మరికొందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.