నవంబర్ 14న 'మెస్సి - లవ్ ఫ్రమ్ ఇండియా' విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: భారతదేశం
ప్రముఖ నటుడు ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం 'మెస్సి - లవ్ ఫ్రమ్ ఇండియా'. నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో ఆకర్ష ఆలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్‌ను పాఠశాల విద్యార్థుల చేతుల మీదుగా లాంచ్ చేశారు. బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.