దివ్యాంగుల కోసం అద్భుత ఆవిష్కరణ: తొంబై వేలతో సోలార్ కారు రూపకల్పన
రిపోర్టర్: సతీష్
స్థలం: Prayagraj
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన విమల్ కిషోర్ అనే దివ్యాంగుడు తన కాళ్ల వైకల్యాన్ని జయించి ఎవరి సహాయం లేకుండా ప్రయాణించేందుకు సరికొత్త సోలార్ కార్‌ను రూపొందించినట్లు తెలిపారు. పాత స్కూటర్ భాగాలు, పనికిరాని వస్తువులను ఉపయోగించి కేవలం తొంబై వేల రూపాయల వ్యయంతో లైలో పేరుతో రెండు సీట్ల బ్యాటరీ కారును తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జీపీఎస్, రివ్యూ కెమెరా వంటి ఆధునిక సౌకర్యాలతో పాటు సోలార్ ప్యానెల్స్ అమర్చినట్లు వివరించారు.