ప్రపంచం చూపు హైదరాబాద్‌ వైపు ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

పెట్టుబడులు మరియు వ్యాపారాలకే కాకుండా నైపుణ్యాలు మరియు ఆవిష్కరణల కోసం ప్రపంచ దేశాలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.