'7 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి': ప్రజల ఫిర్యాదులపై అడిషనల్ ఎస్పీ ఆదేశం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Andhra Pradesh

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ ఎం.కిషోర్ కుమార్ ప్రజల నుంచి మొత్తం 57 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించిన ఆయన, బాధితులకు 7 రోజుల్లోగా చట్టపరమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కఠినంగా ఆదేశించారు.