యువ షట్లర్ల రాకతో భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తు సురక్షితం: పీవీ సింధు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
భారత మహిళల బ్యాడ్మింటన్ లో యువ క్రీడాకారిణులు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని ప్రముఖ షట్లర్ పీవీ సింధు వెల్లడించారు. అంతర్జాతీయ సర్క్యూట్ లో తన్వి శర్మ, అన్మోల్ ఖర్బ్, ఉన్నతి హూడా, దేవికా సిహాగ్ మరియు అస్మిత చలిహా వంటి యంగ్ ప్లేయర్లు రాణిస్తుండటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. గతంలో జూనియర్ల మధ్య పెద్ద ఖాళీ ఉండేదని, కానీ ఇప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నలుగురు ఐదుగురు యువతి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారని సింధు స్పష్టం చేశారు.