పాకిస్తాన్‌లో పెట్రోల్‌పై లీటరుకు వంద రూపాయల సబ్సిడీ ప్రకటన
రిపోర్టర్: కిరణ్
స్థలం: పాకిస్తాన్
పాకిస్తాన్‌లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా లీటర్ పెట్రోల్‌పై రూ.100 సబ్సిడీని ప్రకటించారు. మోటార్ సైకిళ్లు, రిక్షాలు మరియు 800 సీసీ కార్ల యజమానులకు ఈ పథకం వర్తిస్తుందని, బుధవారం రాత్రి నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.