అక్టోబర్ రెండో వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశం
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆదిలాబాద్
జిల్లాలో పత్తి కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్లో సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ రెండో వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తూకం తదితర మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. జిన్నింగ్ మిల్లుల్లో సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.